గుంటూరులోని గోరంట్ల సమీపంలో వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదమయ్యాయి. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఆరోపణలు చేస్తూ కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై మాజీమంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం నియమించిన సీబీఐ ఇప్పటికే లడ్డూ ప్రసాదాల్లో ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టంగా వెల్లడించిందని ఆయన గుర్తు చేశారు.