మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటనకు బయలుదేరారు. ఆయన వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. బైకులు, కార్లతో భారీ ర్యాలీగా గుంటూరు వైపు ప్రయాణం సాగింది. జగన్ పర్యటన నేపథ్యంలో మార్గమధ్యంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. జాతీయ రహదారి మొత్తం జగన్ అభిమానంతో నిండిపోయింది.