గుంటూరు జిల్లాలో రైస్ కార్డుల కోసం ఇప్పటివరకు 52,447 దరఖాస్తులు అందాయి. వీటిలో సుమారు 90% పరిష్కరించగా, కొత్తగా 8,000కుపైగా కార్డులు మంజూరయ్యే అవకాశం ఉంది. తెనాలి, గుంటూరు డివిజన్లలో మంచి స్పందన లభించింది. పేర్ల చేర్పు, తొలగింపు, చిరునామా మార్పు, కార్డు విభజనలకు ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఇంకా 4,300 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.