అశ్లీల ఓటీటీలను కేంద్రం నిషేధించాలని కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు, చిత్ర దర్శకుడు దిల్ రాజు అన్నారు. గుంటూరు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం సాయంత్రం మా-ఏపీ గుంటూరు సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అశ్లీల కంటెంట్కు కేరాఫ్గా నిలిచిన ఓటీటీల అన్నింటిని కేంద్రం నిషేదించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిషేధించిన 24 ఓటీటీలే కాకుండా అనేకం ఉన్నాయని అన్నారు.