జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి (సీఎంవో) పోస్టు భర్తీకి అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో సలీంబాషా తెలిపారు. ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ నాటికి 55 ఏళ్లలోపు వయస్సుతో పాటు ఎస్జీటీగా 8 ఏళ్లు లేదా స్కూల్ అసిస్టెంట్‌గా 5 ఏళ్ల సేవ, సంబంధిత సబ్జెక్టులో పీజీ అర్హత ఉండాలి. దరఖాస్తులను ఈ నెల 10లోగా డీఈవో లేదా ఎస్ఎస్ఏ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.