రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2025కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రేణుక శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. ఉపవిద్యాశాఖాధికారి ఛైర్మన్ గా డివిజన్ స్థాయిలో ఏర్పడిన కమిటీ జిల్లాస్థాయి ఫైనల్ లిస్టును ఆగస్టు 12లోగా సమర్పించాలన్నారు. జిల్లా స్థాయి కమిటీ నుంచి రాష్ట్ర స్థాయికి తుది జాబితా ఈ నెల 16న పంపుతామని తెలిపారు.