ఇళ్ల ఎదుట మురుగు కాలువలు ఎందుకు నిర్మించలేదంటూ కొంతమంది వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా కొట్టారని నాగేశ్వరరావు పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం. గతంలో కొందరు వ్యక్తులు గుడి నిర్వహణకు 50 వేల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు వచ్చి వాటితో కాలువలు ఎందుకు నిర్వహించలేదు అంటూ దాడి చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి కొందరు వ్యక్తులను బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.