గుంటూరు పట్టాభిపురంలోని డిఆర్ఎం కాంపౌండ్ లో గురువారం గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ సుధేష్ణ సేన్ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు. డిఆర్ఎం మాట్లాడుతూ తాను కూడా చిన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా దాతగా ఉన్నానని రక్తం ప్రాణాధారం అని డొనేషన్ క్యాంపులో 74 మంది పాల్గొన్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిఆర్ఎం రమేష్ కుమార్, సీనియర్ డిపిఓ సహబాష్ హనూర్, డి ఎఫ్ ఎం అమూల్యరాజ్, తదితరులు పాల్గొన్నారు.