గుంటూరు బ్రాడిపేటలోని శ్రీ గౌరీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం శతాబ్ది ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లక్ష్మీ నారాయణ స్వామికి సుదర్శన, అష్టాక్షరీ మంత్రాలతో హోమాలు నిర్వహించగా, అనంతరం లక్ష తులసీ దళాలతో అర్చన చేసి మంత్రపుష్పాలు సమర్పించారు. భక్తులు భారీగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.