మొంథా తుఫాన్ నేపథ్యంలో, గుంటూరు నగర ప్రజలు సరఫరా చేసే నీటిని రెండు మూడు రోజులు కాచి, చల్లార్చి తాగాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు గురువారం సూచించారు. సచివాలయ కార్యదర్శులు తమ పరిధిలో కనీసం 10 నీటి నమూనాలను సేకరించి క్లోరిన్ పరీక్షలు చేయాలని ఆదేశించారు. కలుషిత నీటి సరఫరా లేదా పైప్‌లైన్ లీకేజీలను గుర్తిస్తే వెంటనే జిఎంసి కాల్ సెంటర్ 08632345103 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలను కోరారు.