గుంటూరు: రాష్ట్రాన్ని నాశనం చేయాలని తప్పుడు ప్రచారం

తెదేపా జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణి క్యరావు బుధవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ, దుర్మార్గపు పాలన భరించలేక ప్రజలు జగన్ను, వైకాపాను 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు. 'ఇప్పటికే జగన్ తీరు ప్రజలకు అర్థమైంది. ఇక జగన్ 2.0 అంటే అరాచకం, విధ్వంసం. ఏ స్థాయిలో ఉంటుందో ప్రజలు ఊహించగలరు. విజ్ఞులైన ప్రజలు ఇక జగన్ను నాయకుడిగా అసలు ఊహించుకోలేరు. జగన్ వైకాపా నాయకుల్ని అరాచక శక్తులుగా తయారుచేస్తున్నారు. అధికారం కోసం రాష్ట్రాన్ని నాశనం చేయాలని పూటకో అబద్ధంతో జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అని ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్