విజయవాడ వారధి వద్ద బుధవారం జరిగిన ఘోర ప్రమాదంలో ఆర్టీసీ కండక్టర్ ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు డ్రైవర్ పొరపాటున దారి తప్పి, తిరిగి ప్రధాన రహదారిపైకి వచ్చేందుకు బస్సును రివర్స్ తీయగా, వెనుక ఉన్న కండక్టర్‌ను బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.