గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వాసవి క్లాత్ మార్కెట్‌లో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. షాపుల నిర్వాహకులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కొంతమేర నష్టం వాటిల్లింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.