గుంటూరు: రిమాండ్ ఖైదీ కోసం ముమ్మరంగా గాలింపు

గుంటూరు సర్వజనాసుపత్రి (జీజీహెచ్) లో పోలీసుల కస్టడీ నుంచి రిమాండ్ ఖైదీ భీముడు అజిత్ కుమార్ పరారయ్యాడు. అనారోగ్య కారణాలతో రేపల్లె సబ్ జైలు నుంచి ఈనెల 26న జీజీహెచ్కు తరలించిన అజిత్ కుమార్ శనివారం పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. జీజీహెచ్ నుంచి రైల్వేస్టేషన్, బస్టాండ్ మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పలు లాడ్జిల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అజిత్ కుమార్ కుటుంబ సభ్యులను సంప్రదించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్