గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా శనివారం అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతోందని, పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగానే వైసీపీ పనిచేస్తుందని తెలిపారు.