తిరుమల తిరుపతి లడ్డు తయారీలో కల్తీ జరిగిన విషయం నిర్ధారణ అయినప్పటికీ, వైకాపా నీచ రాజకీయాలు చేస్తోందని, ప్రజా రాజకీయాలకు జగన్ అనర్హుడని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. శనివారం తూర్పు నియోజకవర్గం సీతానగర్, రామిరెడ్డి తోటలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.