గుంటూరు: నేడు ఆంధ్ర ముస్లిం కళాశాలలో జాబ్ మేళా

ఆంధ్ర ముస్లిం కళాశాలలో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. స్కిల్, కమ్యూనికేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో 900 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. రూ. 10 వేల నుంచి రూ. 30 వేల వేతనంతో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పలు కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. మంగళవారం ఎమ్మెల్యే నసీర్ ఏర్పాట్లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్