నగరంలో ఆగస్టు 17 , 18 తేదీలలో నిర్వహించనున్న సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి కోరారు. కొత్తపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలోని మల్లయ లింగయ భవన్ లో గురువారం కోటి వీరాంజనేయులు అధ్యక్షతన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తొలి రోజు ప్రదర్శన ఉంటుందని చెప్పారు.