కృష్ణమహల్ రోడ్డులోని ఓ హోటల్లో క్యాటరింగ్ పనులు చేసే షరీఫ్ అనే వ్యక్తి మంగళవారం లాడ్జిలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి, సీఐ వీరయ్య చౌదరి ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడికి శానిటైజర్ తాగే అలవాటు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.