సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని గుంటూరులో శుక్రవారం నాడు ఐక్యత ర్యాలీని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారియా, ఎమ్మెల్యేలు నసీర్, మాధవి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.