గుంటూరు: వైసిపి నేతలపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే

బుధవారం గుంటూరులో ఎమ్మెల్యే గళ్ళా మాధవి వైసీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. ఏబీఎన్ కార్యాలయాల వద్ద వైసీపీ హంగామాను చూసి ప్రజలు వైసీపీని చీదరించుకుంటున్నారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తల్లిని, భార్యను దూషించిన అంబటి వీరికి నాయకత్వం వహించటం చూస్తుంటే కాలకేయ చక్రవర్తి గుర్తుకు వస్తున్నారని విమర్శించారు. మహిళల పట్ల సభ్యత లేని వైసిపి నేతలు దాడులకు పాల్పడటం దుర్మార్గమని, జగన్ రెడ్డి తల్లిని, చెల్లిని సోషల్ మీడియా వేదికగా తిట్టిస్తున్న భారతీ ముందుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్