గుంటూరు: ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నసీర్

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ శనివారం 5వ డివిజన్ రామిరెడ్డితోట ఓల్డ్ క్లబ్ రోడ్ ప్రాంతంలో "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ అభివృద్ధి పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంచారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే ప్రజలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ బిడ్డకు వికలాంగ పింఛన్ ఇప్పించాలంటూ కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్