శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 14, 15 తేదీల్లో గుంటూరు 1, 2 డిపోలతోపాటు పొన్నూరు, తెనాలి, మంగళగిరి డిపోల నుంచి కోటప్పకొండకు వంద ప్రత్యేక బస్సులు నడుపుతామని జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం తెలిపారు. ఈ బస్సులు ఫిబ్రవరి 14న కోటప్పకొండకు వెళ్లి, 16న తిరిగి ఆయా డిపోలకు చేరుకుంటాయని ఆయన పేర్కొన్నారు. క్వారీ, గోవాడ, అమరావతి, శ్రీశైలం క్షేత్రాలకు కూడా ప్రత్యేక సర్వీసులు నడుపుతామని ఆయన వెల్లడించారు.