టౌన్-2 సబ్ డివిజన్ పరిధిలో లైన్ల మరమ్మతులు జరుగుతున్నందున విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉద్యోగనగర్, ఎస్వీఎన్కాలనీ, చంద్ర మౌళినగర్, ఎన్టీఆర్ స్టేడియం తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తు న్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా కోరారు.