గుంటూరు నగర వైసిపి అధ్యక్షురాలు ఫాతిమా మాట్లాడుతూ, అంజుమన్ భూములను కూటమి ప్రభుత్వం నుండి కాపాడుకుంటామని తెలిపారు. ఈ నెల 30న గుంటూరులో భారీ నిరసన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించామని, అయితే ముఖ్యమంత్రి కార్యక్రమం ఉన్నందున జిల్లా ఎస్పీ అనుమతి నిరాకరించారని ఆమె పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంజుమన్ భూములను కాపాడుకునేందుకు అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. వాయిదా పడిన నిరసన ర్యాలీ ఫిబ్రవరి 6న నమాజ్ అనంతరం నగరంపాలెం ఈద్గా నుండి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరుగుతుందని ఆమె వెల్లడించారు.