ఆగస్టు 9, 10 తేదీల్లో చీరాలలో జరిగే ఏపీ స్టేట్ జూనియర్ అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే గుంటూరు జిల్లా జట్లకు ఎంపికైన అండర్-18, 20 బాలబాలికల వివరాలను జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 1వ తేదీ ఉదయం 10 గంటలకు బీఆర్ స్టేడియంలో వయసు ధ్రువీకరణ పత్రంతో రిపోర్టు చేయాలని కోరారు.