2019-2024 మధ్య నాటి జగన్ సర్కార్ సృష్టించిన అస్థిరత కారణంగానే అమరావతికి పార్లమెంట్లో తిరుగులేని చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్ సభలో తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసిందని, అందుకే కేంద్రం అమరావతిని రాజధానిగా గుర్తించి, విభజన చట్టం ప్రకారం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.