గుంటూరు: నేడు కేంద్ర మంత్రి జుయల్ ఓరం పర్యటన

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం బుధవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా మంగళవారం తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు కె. ఎల్. యూనివర్సిటీలో నిర్వహించే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ (ఇ. ఎం. ఆర్. ఎస్) జాతీయ సాంస్కృతిక, సాహిత్య, కళా ఉత్సవ్ (ఉద్భవ్) 2025లో కేంద్ర మంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన బయలుదేరి విజయవాడ చేరుకుని, అక్కడి నుంచి న్యూదిల్లీ వెళతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్