పాత గుంటూరులోని 8వ డివిజన్లో శుక్రవారం జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం నాసిర్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, మరియు నగర కమిషనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ అందిస్తుందని, ఇది పేదల ప్రభుత్వం అని ఆయన అన్నారు.