మన్నవ గ్రామంలో దాడిలో గాయపడ్డ వైసీపీ నేత నాగమల్లేశ్వరరావును బుధవారం గుంటూరులో వైసీపీ నాయకులు పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ, అధికారులు టీడీపీకి దాసోహమయ్యారని విమర్శించారు. నిందితులను అరెస్ట్ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమన్నారు.