గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్, జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన 75 రోజుల్లోనే గంజాయి కార్యకలాపాల్లో పాల్గొంటున్న 163 మందిని గుర్తించి, 28 కేసులు నమోదు చేశారు. వీరిలో 127 మందిని అరెస్ట్ చేశారు. 48 కేజీల గంజాయి, 139 గ్రాముల లిక్విడ్ గంజాయి, 28 గ్రాముల MDMA, 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. గంజాయి కార్యకలాపాలను అరికట్టడానికి 'టాస్క్ ఫోర్స్' బృందాన్ని ఏర్పాటు చేశారు. 'సంకల్పం - మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం' కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. డ్రోన్ గస్తీతో పాటు, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.