కాకుమాను మండలం లింగంగుంటపాలెంలో రవితేజ (22) అనే యువకుడు మంగళవారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.