ప్రభుత్వం వారు రైతులకు అందించే అన్నదాత సుఖీభవ పధకం ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఏఓ నరసింహా రావు తెలిపారు. అర్హులైన రైతులందరి జాబితాలు ప్రతి గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో ఉందని, జాబితాలో పేరు లేని రైతులు వెంటనే మీ గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులందరూ త్వరితగతిన స్పందించాలని కోరారు.