ఈదులపాలెం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

గుంటూరు–చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఈదులపాలెం వద్ద గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాత కోకాకోలా కంపెనీ సమీపంలోని ఖాళీ స్థలంలో మంటలు చెలరేగి దాదాపు పది ఎకరాలకు వ్యాపించాయి. ఎండల తీవ్రత లేదా ఆకతాయిల నిర్లక్ష్యం కారణమా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వేసవిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్