కొత్తపేట పోలీసులు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద మున్నా, చిల్లర ప్రేమ కుమార్ అనే విక్రయదారుల నుంచి లిక్విడ్ గంజాయి, MDMA 3.12 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నగరంలో మత్తు పదార్థాల విక్రయం, సేవనం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు. నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.