గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బుధవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. నైపుణ్య అభివృద్ధికి ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా యువతకు శిక్షణ, అవకాశాలు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సౌజన్యంతో ఎమ్మెల్యే నసీర్ ఈ మేళాను నిర్వహించారు. ఆంధ్రా ముస్లిం కళాశాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ మేళాలో యువత, నిరుద్యోగులు భారీగా పాల్గొన్నారు.