గుంటూరులో మర్డర్..?

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంతపాడులో ఓ వ్యక్తి రక్తపు మడుగులో శవమై కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడి తల, శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో దుండగులు కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. హత్య ఇక్కడే జరిగిందా? లేక వేరే చోట చంపి ఇక్కడ పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్