ఫిరంగిపురం మండలం బేతపూడి వద్ద గురువారం ఒక కొత్త పల్సర్ బైక్ ప్రమాదవశాత్తూ పూర్తిగా దగ్ధమైంది. క్రోసూరుకు చెందిన ఏసుబాబు తన బైక్‌పై వెళ్తుండగా, ఇంజిన్ హీటెక్కి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే బైక్‌ను వదిలేసి దూరంగా పరుగులు తీయడంతో ఏసుబాబు ప్రాణాపాయం నుండి త్రుటిలో బయటపడ్డారు. ఈ నెల 8వ తేదీన సత్తెనపల్లిలో కొన్న కొత్త బైక్ కళ్లెదుటే కాలిపోవడంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.