నుదురుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐ సి డి ఎస్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు డా. యాన్ని గ్రేస్, డా. సబీర బేగం మాట్లాడుతూ తల్లి పాలు త్రాగించుట వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది, పిల్లలు చురుకుగా మెదడు పని తీరు బాగుంటుంది అని తెలిపారు.