గుంటూరు జిల్లాలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లాతో పాటు ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.