గుంటూరులో పల్నాడు ప్రజాప్రతినిధుల సమావేశం

గుంటూరులో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఆదివారం పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాలు, జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో పల్నాడు ఇన్‌చార్జ్ మంత్రి కోళ్లు రవీంద్ర, ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. ఈ భేటీలో ఎన్నికల సన్నాహాలు, అభివృద్ధి పనులపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్