కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఆనందంగా ఉన్నారు: జనసేన అధికార ప్రతినిధి

కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారని, రాష్ట్రంలో విస్తృత స్థాయిలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి తెలిపారు. గుంటూరు నగరంలో సోమవారం ఉదయం కూటమి నేతలు, సచివాలయం సిబ్బందితో కలిసి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం సుమారు 50,000 కోట్ల రూపాయలకు పైగా పింఛన్ల కోసం ఖర్చు చేసిందని, ప్రధాని మోదీ సహకారంతో చంద్రబాబు నాయుడు–పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నదని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్