గుంటూరులో అసాంఘిక శక్తుల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా, శనివారం మధ్యాహ్నం బృందావన్ గార్డెన్స్‌లోని NTR స్టేడియం నుంచి లక్ష్మీపురం మదర్ థెరిస్సా విగ్రహం వరకు రౌడీషీటర్లను వరుసలో నడిపించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.