కొత్త పెన్షన్ స్కీం రద్దు చేయాలి: రైల్వే ఉద్యోగుల ఆందోళన

గుంటూరు బొంగరాల బిడులోని రైల్వే వేగన్ డిపోలో గురువారం సాయంత్రం రైల్వే ఉద్యోగులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పెన్షన్ స్కీమును రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమును కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. "కొత్త పెన్షన్ స్కీం వద్దు పాత పెన్షన్స్ స్కీం ముద్దు" అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంగ్ సభ్యులు మరియు రైల్వే కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్