నంబూరులో సాధు సంత్ సమాగమన మహోత్సవం

పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని శ్రీ రాధా గోవింద మందిరంలో సాధు సంత్ సమాగమన మహోత్సవం  గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్, ఆయన ధర్మపత్ని జ్యోతర్మయి పాల్గొన్నారు. వారు స్వామి ఆశీస్సులు స్వీకరించి, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులు, సాధు సంతులు, ఆధ్యాత్మిక గురువులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఈ మహోత్సవానికి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ నంబూరు పుణ్యసమాగమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సంబంధిత పోస్ట్