రంగస్థల నటుడు బ్రహ్మయ్య మృతి

గుంటూరులో చికిత్స పొందుతూ పౌరాణిక రంగస్థల నటుడు వడ్లమాను బ్రహ్మయ్య (69) బుధవారం మృతి చెందారు. దశాబ్ద కాలం పాటు బిల్వ మంగ ళుడు, విశ్వామిత్రుడు, సత్యకీర్తి, దామోదర వంటి పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయన, స్థానిక షిర్డీ సాయి నాట్య మండలి ఉపాధ్యక్షుడిగా, ఫిరంగిపురం ఉప సర్పంచిగా కూడా సేవలందించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఆ నాట్య మండలి అధ్యక్షుడు జెట్టి సురేంద్రబాబు ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్