గుంటూరు జీజీహెచ్‌లో రూ.132 కోట్లతో అత్యాధునిక మాతా–శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభం

గుంటూరు జీజీహెచ్‌లో రూ.132 కోట్లతో నిర్మించిన అత్యాధునిక మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించనున్నారు. ఈ కేంద్రం కోసం కానూరి జింకానా సభ్యులు రూ.100 కోట్లతో ఐదంతస్తుల భవనాన్ని నిర్మించగా, డా. గవిని ఉమాదేవి రూ.22 కోట్లు విరాళంగా అందించారు. ప్రభుత్వం మరో రూ.27 కోట్లతో ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చింది. 597 పడకల సామర్థ్యం ఉన్న ఈ కొత్త భవనం ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి ప్రసూతి వైద్యం ఉచితంగా అందనుంది.

సంబంధిత పోస్ట్