గుంటూరులోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు నందమూరి తారక రామారావు స్ఫూర్తిని స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. టీడీపీ అభివృద్ధి, పేదల సంక్షేమం లక్ష్యంగా కొనసాగుతుందని, సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.