అమరావతి రాజధాని నిర్మాణ పనులలో పనిచేస్తున్న కార్మికులు అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత కలిగి ఉండాలని గుంటూరు జిల్లా అగ్నిమాపక అధికారి శరత్ బాబు సూచించారు. గురువారం తుళ్లూరులోని ఆర్వీఆర్ క్యాంపులో రహదారులు మరియు భవనాలలో పనిచేస్తున్న కార్మికులకు నిర్మాణ ప్రదేశాలలో తలెత్తే అగ్ని ప్రమాదాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ క్యాంపుల్లో ఉండే కార్మికులు గ్యాస్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలన్నారు.