గుంటూరు మెడికల్ కాలేజీ వద్ద విషాదం. చెట్టు కూలి వ్యక్తి మృతి

గుంటూరు మెడికల్ కాలేజీ సమీపంలో శనివారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో సాయి కృష్ణ ప్రసాద్ (42) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. నగరంపాలెం నుంచి రైల్వే స్టేషన్‌కు కుటుంబంతో కలిసి బైక్‌పై వెళ్తుండగా, భారీ వేపచెట్టు ఒక్కసారిగా కూలి వారిపై పడింది. ఈ ఘటనలో ఆయన భార్య కొలగాని సరిత, ఎనిమిదేళ్ల కుమారుడు కార్తీక్ గాయపడ్డారు. కార్తీక్ ఎడమ కాలు విరిగినట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్